కస్టమర్ల అనుమతి లేకుండా ఈ-కేవైసీ ద్వారా తమ మొబైల్ వినియోగదారుల పేరిట పేమెంట్ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నట్టు యూఐడీఏఐకి ఎయిర్‌టెల్‌పై ఫిర్యాదులు అందాయి. వంటగ్యాస్ సబ్సిడీని బ్యాంకు ఖాతాలకు మళ్లిస్తూ మొత్తం 23లక్షల మందికిపైగా ఖాతాదారుల నుంచి దాదాపు రూ.47 కోట్ల వరకు జమ అయ్యాయి. దీనిపై స్పందించిన యూఐడీఏఐ.. ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఈ-కేవైసీ లైసెన్స్‌లను తాత్కాలికంగా రద్దు చేసింది.