ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో రాకతో మిగిలిన టెలికాం రంగ సంస్థలు తమ ఖాతాదారులను కోల్పోకూడదనే ఉద్దేశంతో ఇన్ని రోజులు అడపాదడపా ఆఫర్లు ఇస్తూనే ఉన్నాయి. కానీ ఇక మీదట అలా కుదిరే అవకాశం కనిపించట్లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత రేట్లు పెరగడం ఇదే మొదటిసారిగా అయ్యే అవకాశంగా కనిపిస్తుంది.
ఒక్కొక్క వొడాఫోన్ ఐడియా యావరేజ్ రెవెన్యూ.. రూ.119గా ఉండగా భారతీ ఎయిర్‌టెల్ (రూ.162), జియో (రూ.145) గా ఉంది. ఈ సందర్భంగా వొడాఫోన్ ఐడియా ఎండీ రవీందర్ టక్కర్ ప్రస్తుత టాక్ టైమ్ ధరల గురించి మాట్లాడుతూ.. ధరలు రేట్లు పెంచడంలో ఎటువంటి మొహమాటం లేదు. అందుకే ఈ ఇయర్ ఎండింగ్‌లో టాక్ టైమ్ ధరల్ని పెంచే ప్రయత్నం చేస్తామన్నారు.
దీనిని బట్టి న్యూఇయర్ సందర్భంగా టాక్ టైమ్ ప్లాన్స్ భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇయర్ ఎండింగ్ టైమ్‌లో టెలికాం రంగ సంస్థలైన ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు టాక్ టైమ్ ధరల్ని 15 నుంచి 20 శాతం పెంచేందుకు సిద్ధమైనట్లు సమాచారం.