ఎయిర్ టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లకు భారతీ ఎయిర్‌టెల్ సంస్థ మరో ఆఫర్‌ను అందిస్తోంది. పలు ప్రీపెయిడ్ ప్లాన్లను వాడుతున్న వారికి ఉచితంగా డేటా కూపన్లను అందజేస్తోంది. రూ.219, రూ.289, రూ.448, రూ.599 ప్లాన్లను వాడుతున్న వారికి ఈ కూపన్లు లభిస్తాయి. అయితే ఇందుకు గాను ఆయా ప్లాన్లను ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా రీచార్జి చేసుకోవాలి. దీంతో ఉచిత కూపన్లు వస్తాయి.
ఎయిర్‌టెల్ ఆయా ప్లాన్లకు అందించే కూపన్లకు వాలిడిటీ కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. కూపన్‌ను రిడీమ్ చేశాక ఒక్క రోజులోగా దానికి అందించే ఉచిత డేటాను వాడుకోవాలి. కాగా రూ.289 ప్లాన్‌లో కస్టమర్లకు నిత్యం 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. దీనికి 1జీబీ డేటా చొప్పున 2 ఉచిత కూపన్లు వస్తాయి.
అలాగే రూ.448 ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. దీనికి కూడా 1జీబీ డేటా చొప్పున 2 ఉచిత కూపన్లు వస్తాయి. రూ.599 ప్లాన్‌కు 4 కూపన్లు ఇస్తారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇందులో రోజుకు 3జీబీ డేటా వస్తుంది.