గత యేడాది నవంబరు - డిసెంబరు నెలలో ఈ కంపెనీ భారీగా చార్జీలను పెంచిన విషయం తెల్సిందే. అపుడు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు 18 నుంచి 25 శాతం మేరకు టారిఫ్‌లను పెంచేశాయి. ఇపుడు మరో విడత పెంపునకు సిద్ధమవుతున్నాయి.
ప్రస్తుతం ప్రీపెయిడ్ చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని, వీటి కనీస ధరను రూ.200గా చేర్చాల్సిన అవరం ఎంతైనా ఉందని గోపాల్ మిట్టల్ అన్నారు. అంటే కనీసం 10 నుంచి 20 శాతం మేరకు ధరలు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.