ఎలాగంటే.. ఐఫోన్, ఐప్యాడ్‌లోని సఫారీ బ్రౌజర్‌లో ఏషియన్ అని టైప్ చేస్తే.. బ్లాక్ చేసినట్టు ఓ సందేశం దర్శనమిస్తుంది. అంతేకాదు.. ఏషియన్ ఫుడ్ అని రాసినా, ఏషియన్ డైనాస్టీస్ అని పదం టైప్ చేసినా అదే పునరావృతం అవుతుంది. అంతెందుకు, హైదరాబాద్‌లో ఉన్న ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ గురించి తెలుసుకోవాలనుకున్నా ఐఫోన్ సఫారీలో కుదరదు. ఎందుకంటే అందులో ఏషియన్ ఉంది కాబట్టి.
సఫారీలో రావట్లేదు కదా అని గూగుల్ క్రోమ్ లో టైప్ చేద్దామని చూస్తారా.. అక్కడా వెంటనే ఆ పదాలను బ్లాక్ చేస్తోంది యాపిల్. ఇందుకు కారణం.. కొత్తగా వచ్చిన ఐవోస్ 12 సాఫ్ట్‌వేర్‌లోని కంటెంట్ ఫిల్టర్ అనే ఓ కొత్త ఫీచరే. కంటెంట్ ఫిల్టర్‌లో కొన్ని పదాలపై ఆంక్షలు పెడితే.. ఆసియా అనే పదం ఉండే విషయాలూ బ్లాక్ అవుతున్నాయి. దీనిపై ఇప్పటిదాకా యాపిల్ సంస్థ స్పందించనూ లేదు.