మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ త్వరలో భారత దేశంలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. ఈ పర్యటన గత మూడు సంవత్సరాలలో తన మూడవ పర్యటన అంటూ వెల్లడించారు. రెండు దశాబ్దాలకు పైగా భారతదేశంలో గేట్స్ ఫౌండేషన్, దీర్ఘకాలిక కార్యాచరణను హైలైట్ చేస్తూ, ఆయన తన లింక్డ్ఇన్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి భారతదేశం సరైన ప్రదేశం అని బిల్ గేట్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్ సాధించిన విజయాలకు ఆయన మరోసారి ప్రశంసించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఇంకాదేశం పురోగతిని ప్రశంసించారు.