ముంబై కుర్లాలో బస్సు బీభత్సం - ఆరుగురు మృతి - 49 మందికి గాయాలు (Video)

ఠాగూర్

మంగళవారం, 10 డిశెంబరు 2024 (11:15 IST)
ముంబై మహానగరంలోని కుర్లాలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. నియంత్రణ కోల్పోయిన బస్సు వాహనాలపైకి దూసుకెళ్లింది. అంతటితో ఆగని ఆ బస్సు అపార్టుమెంట్ గేట్లను ఢీకొట్టి సెల్లార్‌లోకి దూసుకెళ్లి ఆగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 49 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ బీభత్సానికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లోకల్ ఎలక్ట్రిక్ బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికి బయలుదేరింది. ఈ బస్సు వేగంగా వెళుతు అదుపుతప్పడంతో ముందు వెళుతున్న ఓ రిక్షాను, మూడు కార్లను, బైకర్లతో పాటు రోడ్డుపై నడిచివెళుతున్న పాదాచారులను కూడా ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 49 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

???????????????? ???????????? ???????????????? ???????????????? ???????? ???????????????????????????????????????????? ???????? ???????????????????? ???????????????? | Bus moving towards Kurla station on crowded S.G. Barve Marg (CST Road) lost control at vegetable market near L Ward Municipal office & hitting many vehicles mowed down traders & passersby’s.… pic.twitter.com/FqY6BJh1jv

— MUMBAI NEWS (@Mumbaikhabar9) December 9, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు