ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన మొబైల్ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ టెలికాం రంగంలోకి ప్రవేశించిన రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వీలుగా అన్ని టెలికాం కంపెనీలు వివిధ రకాల ఆఫర్లతో ముందుకొస్తున్న విషయం తెల్సిందే. తద్వారా తమ ఖాతాదారులు పక్క చూపులు చూడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ కూడా సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. కేవలం రూ.149 రీచార్జ్‌తో ఏ నెట్‌వర్క్‌కు అయినా నెలరోజులపాటు 30 నిమిషాల పాటు లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చని ప్రకటించింది.