మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఐటీ చట్టంలో భాగంగా పెనాల్టీ ప్రొసీడింగ్స్‌కు కూడా గడువును మార్చి 31 వరకు పొడిగించారు.
బ్యాంకు ఖాతాలు తెరవడం, బ్యాంకు ఖాతాలో నగదు డిపాజిట్ చేయడం, డీమ్యాట్ ఖాతా తెరవడం, స్థిరాస్తుల లావాదేవీ, సెక్యూరిటీలలో లావాదేవీలు వంటి ఆర్థిక లావాదేవీల కోసం పాన్ కార్డు తప్పనిసరి.