ఎలాన్ మస్క్‌కు టెస్లా షాక్.. అయితే ప్రపంచ కుబేరుల జాబితాలో..?

శుక్రవారం, 21 జులై 2023 (13:50 IST)
ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న టెస్లా, ట్విట్టర్, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. టెస్లా షేర్లు కుప్పకూలడంతో ఎలాన్ మస్క్‌కు ఒక్క రోజే 20.3 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 1.64 లక్షల కోట్లు సంపద కోల్పోవాల్సి వచ్చింది. 
 
అయినప్పటికీ ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానంలోనే కొనసాగుతుండటం గమనార్హం. భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1.64 లక్షల కోట్లను ఎలాన్ మస్క్ కోల్పోయినా ప్రపంచ కుబేరుల జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని మాత్రం కోల్పోలేదు. 
 
భారీ సంపద నష్టపోవడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించనున్నట్లు టెస్లా సంస్థ ప్రకటించింది. ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ స్థాపించిన ఎల్‌వీఎంహెచ్‌ షేర్లు భారీగా పతనం అయ్యాయి. 
 
అయితే భారీగా సంపద నష్టపోయినా కూడా మస్క్ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు. బెర్నార్డ్ కంటే మస్క్ సంపద 33 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉండటం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు