వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు : ఇకపై వీడియో కాలింగ్ ఆప్షన్

గురువారం, 3 మే 2018 (12:48 IST)
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ సరికొత్తగా రెండు ఫీచర్లను అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్లలో భాగంగా, గ్రూప్ వీడియో కాలింగ్, థర్డ్ పార్టీ స్టిక్కర్స్ పేరిట ఇవి అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈమేరకు వీటి వివరాలను వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌‌బుక్ సీఈవో జుకర్‌ బర్గ్ ఇటీవల జరిగిన ఫేస్‌బుక్ ఎఫ్8 డెవలపర్ సదస్సులో వెల్లడించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వాట్సాప్‌‌లో వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్లకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుందని, ఈ క్రమంలోనే త్వరలో గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను వాట్సాప్‌‌లో అందివ్వనున్నట్లు తెలిపారు. అలాగే థర్డ్ పార్టీ డెవలపర్లు డెవలప్ చేసే స్టిక్కర్లకు కూడా వాట్సాప్‌‌లో సపోర్ట్‌ను ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే, ఫేస్‌బుక్‌లో తమ హిస్టరీని క్లియర్ చేసుకునే ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకుని రానున్నట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు