ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించింది. సెప్టెంబర్ 18న ప్రారంభమై సెప్టెంబర్ 20 వరకు రెండు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, టీవీ, యాక్సెసరీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా గ్యాడ్జెట్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. మరోవైపు ఆకర్షణీయమైన ఆఫర్లకు వివిధ క్రెడిట్ కార్డులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది.