రియల్ మీ తన రెండు బడ్జెట్ ఫోన్లయిన రియల్ మీ సీ12, రియల్ మీ సీ15 స్మార్ట్ ఫోన్లు ఆగస్టు 18వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని రియల్ మీ తన వెబ్ సైట్ ద్వారా ప్రకటించింది. ఈ రెండు డివైస్‌ల్లోనూ 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. రియల్ మీ సీ12 గీక్ బెంచ్, బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వెబ్ సైట్లలో ఇప్పటికే కనిపించింది.