ఫ్లిఫ్ కార్ట్ క్విక్ పేరుతో 90 నిమిషాల్లో డెలివరీ.. ఆ సంస్థలకు షాకిచ్చినట్టేనా?

బుధవారం, 29 జులై 2020 (10:58 IST)
ఈ-కామర్స్ సంస్థ కరోనా కాలంలో కీలక ప్రకటన చేసింది. కరోనా నేపథ్యంలో బుక్ చేసిన గంటల్లో వినియోగదారులకు వస్తువులు అందేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గ్రాసరీస్ డెలివరీ చేస్తున్న కంపెనీలు కొన్ని గంటల సమయం తీసుకుంటున్నాయి. వాటికి షాకిచ్చేలా ఫ్లిప్ కార్ట్ కేవలం గంటన్నరలో వస్తువులు డెలివరీ చేస్తామని ప్రకటించింది. 
 
ఈ నేపథ్యంలో ఇక నుంచి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వస్తువులను 90 నిమిషాల్లోనే కస్టమర్లకు డెలివరీ చేస్తామని ఫ్లిఫ్ కార్ట్ ప్రకటించింది. ఈ ప్రకటనతో అమెజాన్, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలకు ఫ్లిప్ కార్ట్ షాకిచ్చింది. 
 
కరోనా వైరస్ ప్రభావంతో గ్రాసరీస్ ఆన్‌లైన్ డెలివరీకి ఫుల్ డిమాండ్ నెలకొంది. డిమాండ్‌కు తగ్గట్టుగా కంపెనీలు తమ సేవలను విస్తరిస్తున్నాయి. జియో మార్ట్‌కు కూడా ఫ్లిప్ కార్టు ఝలకిచ్చిందని చెప్పవచ్చు. ఫ్లిప్ కార్టు ఒక అడుగు ముందుకు వేసి మొబైల్ ఫోన్లను కూడా వేగంగా అందిస్తామని ప్రకటించడంతో ఇతర కంపెనీలకు గట్టి షాకిచ్చినట్టైంది. 
 
ఫలితంగా గ్రాసరీస్, హోమ్ యాక్ససిరీస్‌లను కొనుగోలు చేస్తే కేవలం గంటన్నరలో అందిస్తామని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ క్విక్ పేరుతో ఈ హైపర్ లోకల్ సర్వీసులు ఆఫర్ చేయనుంది. రాబోయే రోజుల్లో మొబైల్ ఫోన్లను కూడా వేగంగా డెలివరీ చేస్తామని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. 
 
ప్రస్తుతం ఈ సేవలు బెంగుళూరులోని కొన్ని ప్రాంతాలల్లో అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఇవి అమల్లోకి రానున్నాయి. గూగుల్‌కు చెందిన డుంజో, స్విగ్గీ కూడా భారత్‌లో గ్రాసరీస్‌ను డెలివరీ చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు