కేవలం రూపాయికే.. చక్కెర, కందిపప్పు, నూనె.. ఎక్కడ?

గురువారం, 27 సెప్టెంబరు 2018 (16:39 IST)
ఏంటి ఒక్క రూపాయికే కేజీ కందిపప్పు, కేజీ పంచదార, కేజీ నూనె ఇస్తున్నారా? ఎక్కడ? అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. అవునండి నిజమే. అనతికాలంలోనే దిగ్గజ ఆన్‌లైన్ వ్యాపార సంస్థగా ఎదిగిన ఫ్లిప్‌కార్ట్ ఇక నుంచి నిత్యావసర సరుకులను కూడా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫ్లిఫ్ కార్ట్ సంస్థ బొనాంజా ఆఫర్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. 
 
వివిధ రకాలైన వస్తువులపై భారీ తగ్గింపును ఆన్‌లైన్‌లో వుంచింది. ఆన్‌లైన్‌లో ఒక రూపాయికే లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. అంతేగాకుండా కేవలం రూపాయికే పంచదార ప్యాకెట్, కేజీ కందిపప్పును ఆన్‌లైన్ సేల్స్‌లో పెట్టింది. 
 
ఫ్లిప్ కార్ట్ గ్రోసెరీ అనే టైప్ చేసి వెబ్ పేజీలోకి వెళ్లవచ్చు. అందులో రూపాయికే పంచదార, హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్, థమ్స్ అప్ వంటివి లభిస్తాయి. ఇంకా పిన్‌కోడ్ అందుబాటులో వున్న కస్టమర్లకే ఈ ఉత్పత్తులు అందుబాటులో వుంటాయని ఫ్లిఫ్ కార్ట్ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు