దేశంలో రూ.82వేల కోట్ల పెట్టుబడి.. సుందర్ పిచాయ్ ప్రకటన

శనివారం, 24 జూన్ 2023 (19:14 IST)
మనదేశంలో రూ.82వేల కోట్లను గూగుల్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు సుందర్ పిచాయ్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో-బిడెన్‌తో భేటీ కానున్న నేపథ్యంలో... వాణిజ్యం, రక్షణ తదితర పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు సమాచారం. 
 
అదేవిధంగా, ప్రధాని మోదీ యూఎస్ పార్లమెంట్‌లో ప్రసంగించారు. అమెరికా పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ని కలిశారు. 
 
తదనంతరం, దేశంలోని డిజిటలైజేషన్ కోసం గూగుల్ రూ.82 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు సుందర్ పిచాయ్ ప్రకటించారు. అదేవిధంగా అమేజాన్ భారత్‌లో లక్షా 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు