మెస్సేజింగ్ యాప్స్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉండడం తప్పనిసరి అవసరమని టెక్నాలజీ కంపెనీలకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గుర్తు చేసింది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ సాంకేతికత ఉంటే సందేశాన్ని పంపిన వారు, అందుకున్న వారు మినహా మరెవరూ, చివరికి కంపెనీ కూడా చూడలేదని వెల్లడించింది.
అలాగే గూగుల్ సరికొత్త యాప్ ప్రభుత్వ గూఢచర్యానికి ఇది చక్కగా పనికొస్తుందని తెలిపింది. ఇది గూగుల్‌కు తిరోగమన చర్యగానే మిగిలిపోతుందని గూగుల్ చెప్పుకొచ్చింది. గూగుల్ ప్రవేశపెట్టిన ఈ మెసేజింగ్ యాప్.. వాట్సాప్, ఐ మెస్సేజ్‌లతో పోటీ పడలేదని ఆమ్నేస్టి తెలిపింది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ మెస్సెంజర్, యాపిల్ ఐ మెస్సేజ్ రెండు సేవలు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉన్నవేనని ఆమ్నేస్టి చెప్పుకొచ్చింది.