సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ బ్రియాన్ రాజీనామాను కోరడం వల్లే ఆయన రిజైన్ చేశారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే, ఆయనతో సంబంధం కలిగిన మహిళ పేరును వెల్లడించడానికి మాత్రం వారు నిరాకరించారు. జానిచ్ రాజీనామా నేపథ్యంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాబ్ స్వాన్ తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారు.