వినాయక చవితికి 8 నగరాల్లో జియో ఎయిర్ ఫైబర్ సేవలు

మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (15:58 IST)
Jio airfiber
వినాయక చవితి రోజున జియో ఎయిర్ ఫైబర్ సేవలను 8 నగరాల్లో ప్రారంభించినట్లు జియో ప్రకటించింది. ఇందులో భాగంగా ఇంటర్నెట్ సేవలను ఫైబర్ కేబుల్ ద్వారా అన్ని ప్రాంతాలకు అందించే దిశగా ఈ సేవలు ప్రారంభం అయ్యాయి. 
 
దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో ఫైబర్ సేవ ఉన్నప్పటికీ, గ్రామాలకు ఈ ఫైబర్ సేవలు దూరంగా వున్నాయి. ఈ నేపథ్యంలో జియో సంస్థ తన కొత్త ఎయిర్‌ఫైబర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఎయిర్ ఫైబర్ సేవలకు వయర్స్ అవసరం లేదు.
 
కాబట్టి ఎప్పుడైనా అతివేగ ఇంటర్నెట్ సేవను పొందవచ్చు. ప్రస్తుతం చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కత్తా, ముంబై, పుణె, ఢిల్లీ వంటి 8 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అది కూడా వినాయక చతుర్థి రోజున ఈ సేవలను దేశంలోని ముఖ్యమైన 8 నగరాల్లో అందుబాటులోకి తేవడం విశేషం. 
Jio airfiber
 
ఇందులో భాగంగా జియో AirFiber, Jio AirFiber Max వంటి రెండు ఆప్షన్‌లలో 9 రీచార్జ్ ప్లాన్‌లు పరిచయం చేయడం జరిగింది. ఈ సేవల కోసం రూ.399 నుండి గరిష్టంగా రూ.3999 వరకు 6 రీచార్జ్ ప్లాన్‌లు పొందవచ్చు. ఈ ప్లాట్‌లలో 550+ టీవీ ఛానెల్‌లు, నెట్‌ప్లిక్స్, ప్రైమ్, జియో సినిమా సహా 14 యాప్‌లను అందిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు