ఐడియా, వొడాఫోన్ ఏకమైతే.. ఎయిర్ టెల్, జియోకు కష్టకాలమేనా?

గురువారం, 3 ఆగస్టు 2017 (12:53 IST)
టెలికాం రంగ సంస్థలు ఈ ఏడాది ఆదాయంలో పది శాతం మేర నష్టాన్ని చవిచూస్తాయని, తద్వారా వొడాఫోన్, ఐడియా సంస్థల రెవెన్యూ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉచిత డేటా పేరుతో రంగంలోకి దిగిన జియోకు పోటీగా ఆఫర్లను ప్రకటిస్తున్న ఎయిర్ టెల్ వంటి సంస్థల ఆదాయం ఈ ఏడాది చాలామటుకు తగ్గుతుంది.

దీంతో పది శాతం మేర ఆదాయంలో నష్టం వాటిల్లితే.. ఆయా సంస్థలు నష్టాల నుంచి గట్టెక్కేందుకు దాదాపు 12 నుంచి 24 నెలల సమయం పడుతుంది. ఆ  గ్యాప్‌లో వొడాఫోన్, ఐడియా సంస్థలు విలీనం కావడం ద్వారా ఎయిర్ టెల్, జియోలను దెబ్బతీస్తాయని టెలికాం నిపుణులు అంటున్నారు. 
 
ఈ రెండు కంపెనీలు ఏకమైతే టెలికాం రంగంలో అతిపెద్ద నెట్‌వర్క్ సంస్థ ఉత్పన్నమైనట్లేనని వారు జోస్యం చెప్తున్నారు. వొడాఫోన్, ఐడియాలు ఏకమై.. ఎయిర్ టెల్, జియోతో పాటు మూడు టెలికాం సంస్థలకు గండికొడుతాయని.. తద్వారా వాటాలు 85 శాతం మేరకు పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి