ఈ నేపథ్యంలో మార్క్ జుకర్ బర్క్‌కు చెందిన మెటా సంస్థ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని సూచించింది. ఒకవేళ నియామవళిని ఉల్లంఘిస్తే ఇంటికెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. సెప్టెంబరు 5 నుంచి వారానికి మూడు రోజుల పాటు ఆఫీసులకు వచ్చి పనిచేయాల్సిందేనని ఉద్యోగులకు జారీ చేసిన నోటీసులో మెటా పేర్కొంది.
ఒకవేళ పదేపదే నియమాలను ఉల్లంఘిస్తే ఉద్యోగాలు తొలగిపోయే ప్రమాదమూ ఉంటుందని హెచ్చరించింది. కార్యాలయాలకు వస్తున్నదీ లేనిదీ తనిఖీ చేయాలని మేనేజర్లకు సూచించింది. ఉద్యోగుల మధ్య బంధాలు బలోపేతం చేయడానికి, టీమ్ వర్క్ ఈ నిర్ణయం దోహదపడుతుందని నోటీసులో పేర్కొంది. అయితే, ఈ నిర్ణయం నుంచి రిమోట్ ఉద్యోగులను మెటా మినహాయించింది.