వెయ్యిమందిని తొలగించిన మైక్రోసాఫ్ట్..

మంగళవారం, 18 అక్టోబరు 2022 (14:30 IST)
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగించింది. పలు డివిజన్ల నుంచి ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. దీంతో పలువురు ఉద్యోగులు ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో తాము తొలగింపునకు గురైనట్టు పోస్ట్ లు పెడుతున్నారు.
 
మైక్రోసాఫ్ట్ తనను తొలగించినట్టు మైక్రోసాఫ్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వద్ద పనిచేసే వర్క్ సూపర్ వైజర్ కేసీలెమ్సన్ ప్రకటించారు. దీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వారిపై మైక్రోసాఫ్ట్ తొలగించింది. 
 
దీనిపై మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. "అన్ని సంస్థల మాదిరే మేము సైతం మా ప్రాధాన్యతలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటాం. దానికి తగినట్టు మార్పులు చేస్తుంటాం" అని తెలిపారు. మైక్రోసాఫ్ట్ కు ప్రపంచవ్యాప్తంగా 1.8 లక్షల మంది ఉద్యోగులు ఉంటే, అందులో ఒక శాతాన్ని తగ్గించుకోవాలన్నది సంస్థ లక్ష్యంగా ఉంది.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు