ఏఐ ఫీచర్లతో మొబైల్ ఫోన్.. ధర రూ.22 వేలు మాత్రమే

ఠాగూర్

బుధవారం, 2 ఏప్రియల్ 2025 (16:46 IST)
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ మోటోరాలా తమ సిరీస్ ఉత్పత్తుల్లో భాగంగా ఎడ్జ్ సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్ ఫోనును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. గత యేడాది ఎడ్జ్ 50 ప్యూజన్‌ను తీసుకునిరాగా, తాజా ఎడ్జ్ 60 ప్యూజన్‌ను విడుదల చేసింది. ఇది 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 68డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో రూపొందించారు. ఈ మొబైల్ ఫోనులోని ఫీచర్లను పరిశీలిస్తే, 
 
మోటో ఎడ్జ్ 60 ప్యూజన్ 6.70 అంగుళాల 1.5కె ఆల్ కర్వ్‌డ్ పీఓఎల్‍‌ఈడీ డిస్ ప్లేతో వస్తుంది. 120 హెచ్.జడ్ రిఫ్రెష్ రేటు ఉంది. 4500 నిట్స్‌పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్ 10+ సపోర్టుతో పని చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌తో తయారు చేశారు. 
 
ఇందులో మీడియాటెక్ డైమెన్‌సిటీ 7400 ప్రాసెస్‌ను అమర్చారు. ఔటాఫ్‌ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 హలో యూఐతో పని చేస్తుంది. మూడేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది. 
 
ఇక కెమెరా విషయానికి వస్తే 50ఎంపీ సోనీ ఎల్‌‍వైటీ 700సీ ప్రధాన కెమెరా అమర్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. 13 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ముందు వైపు 32 ఎంపీ సెన్సర్‌ను అమర్చారు. దీంతో 4కె వీడియోలు రికార్డు చేసుకోవచ్చు. 
 
5జీ, 4జీ ఎల్‌టీఈ, డ్యూయల్ బాండ్  వైఫై, బ్లూటూత్, 5.4 జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, టైప్-సి పోర్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇందులో 5500 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇన్‌బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సదుపాయంతో పాటు అనేక అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కాగా, ఈ ఫోన్ ధరను రూ.22,999గా నిర్ణయించింది. 12జీబ + 256 వేరియంట్ ధరను రూ.24,999గా పేర్కొంది. ఏప్రిల్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరాలా వెబ్‌సైట్లలో కొనుగోలు చేయొచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు