పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

దేవీ

బుధవారం, 2 ఏప్రియల్ 2025 (16:34 IST)
Fani motion poster launch with K Raghavendra Rao
పాము నేపథ్యంలో గతంలో పలు సినిమాలు వచ్చాయి. కానీ పర్యావరణాన్ని కాపాడే నేపథ్యంగా విషయంలోని పాము పగపట్టే కథతో వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో ఫణి సినిమా రూపొందింది. పూర్తిగా అమెరికాలో నిర్మించిన ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదలకాబోతుంది. నేడు హైదరాబాద్ లో సీనిమ్యాక్స్ థియేటర్ లో  ఫణి మోషన్ పోస్టర్ ను కె రాఘవేంద్రరావు  లాంఛ్ చేశారు.
 
అనంతరం ఆయన మాట్లాడుతూ - ఆదిత్య అంటే సూర్యుడు. సూర్యుడు అన్ని దేశాల్లో ఉదయిస్తాడు. అలా "ఫణి" సినిమాను గ్లోబల్ మూవీగా రూపొందిస్తున్నారు వీఎన్ ఆదిత్య. ఆదిత్య నా దగ్గర పనిచేయలేదు. కానీ నాకు ఇష్టమైన వాడు. అతను కొత్త వాళ్లతో సినిమా చేయగలడు, స్టార్స్ తోనూ రూపొందించగలడు. వారి సోదరి మీనాక్షి నిర్మాణంలో "ఫణి" సినిమా చేస్తున్నాడు. కేథరీన్ అంటే సరైనోడులో ఎమ్మెల్యే గుర్తొస్తుంది. ఈ సినిమాలో ఎలాంటి రోల్ లో కనిపిస్తుందనే అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఈ మూవీ టీమ్ అందిరికీ ఆల్ ది బెస్ట్. "ఫణి" సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ డా.మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ, మొదట్లో చిన్న చిత్రంగా మొదలుపెట్టినా ఆ తర్వాత గ్లోబల్ మూవీగా తయారైంది. మా అన్నయ్య వీఎన్ ఆదిత్య సినిమాలు థియేటర్స్ లో చూడటమే నాకు తెలుసు. ఇలా వేదిక మీద మాట్లాడటం మొదటిసారి. "ఫణి" సినిమాలో కేథరీన్ నటనకు నేషనల్ అవార్డ్ వస్తుంది. ఆమె చేసిన ప్రతి సన్నివేశం చూస్తున్నప్పుడు మాలో కలిగిన ఫీలింగ్ ఇదే. ఈ చిత్రంలో కేథరీన్ తో పాటు పాము క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది. పామును కూడా మా అన్నయ్య ఆడిషన్ చేసే తీసుకున్నాడు. మహేశ్ శ్రీరామ్ మా ఫ్యామిలీ మెంబర్ లాంటివాడు. మా సంస్థలో మరిన్ని మూవీస్ నిర్మించాలని అనుకుంటున్నాం. మీ అందరి సపోర్ట్ దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
 
రైటర్ పద్మ మాట్లాడుతూ - "ఫణి" సినిమా కోసం వీఎన్ ఆదిత్య గారు పిలిచినప్పుడు రోమ్ కామ్ స్టోరీ గానీ లవ్ స్టోరీగాని చెబుతారని అనుకున్నా. కానీ ఆయన పాము కథ వినిపించారు. ఈ కథలో ఒక బ్యూటిఫుల్ ఇంటెన్షన్ ఉంది. ఈ భూమి మనదే కాదు ప్రకృతిది కూడా అనే మంచి పాయింట్ ఈ కథలో చెబుతున్నాం. కేథరీన్ అందంగా ఉండటమే కాదు అందంగా నటించింది. మా టీమ్ అందరూ "ఫణి" సినిమా కోసం ప్యాషనేట్ వర్క్ చేశారు. అన్నారు.
 
హీరో మహేశ్ శ్రీరామ్ మాట్లాడుతూ, మా నేటివ్ ప్లేస్ హైదరాబాద్. ప్రస్తుతం హాలీవుడ్ లో మోడలింగ్, మూవీస్ చేస్తున్నాను. "ఫణి" సినిమాలో నటించడం సొంత ఇంటికి వచ్చినట్లుంది. ఈ సినిమాలో కేథరీన్ గారితో కలిసి నటించడం మర్చిపోలేను. ఆమె చాలా మంచి కోస్టార్. ప్రొడ్యూసర్ మీనాక్షి గారు, ఇతర వండర్ ఫుల్ టీమ్ తో వర్క్ చేసే అవకాశం ఈ చిత్రంతో దక్కింది. "ఫణి" సినిమాను మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
హీరోయిన్ కేథరీన్ ట్రెసా మాట్లాడుతూ, "ఫణి" సినిమా కోసం ఆదిత్య గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు పాములంటే నాకు భయం, పాముతో నేను చేయాల్సిన సీన్స్ అన్నీ సీజీలో చేయాలని రిక్వెస్ట్ చేశాను. ఆయన సరే అన్నారు. అయితే షూటింగ్ చివరలో పాము కాంబినేషన్ లో నాతో సీన్స్ చేయించారు. ఒకసారి సీన్ కంప్లీట్ అయ్యేసరికి పాము నా ముఖానికి దగ్గరగా ఉంది. నా ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. వీఎన్ ఆదిత్య గారు ప్రతిసారీ జానర్ మార్చి కొత్తగా ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి తరహా సినిమా నేను ఇప్పటిదాకా చేయలేదు. మా సినిమాలో వివిధ దేశాల ఆర్టిస్టులు నటించారు. ప్రొడ్యూసర్ మీనాక్షి గారికి ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నా. మే నెలలో మా "ఫణి" చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.
 
డైరెక్టర్ డా.వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ - నేను ఎప్పుడు యూఎస్ వెళ్లినా నా సోదరి మీనాక్షి, బావగారు శాస్త్రి గారి ఇంట్లో ఉంటాను. అక్కడి నుంచే వేరే స్టేట్స్ కు వెళ్తుంటాను. ఎన్నోసార్లు మేము కలిసినా కలిసి సినిమా చేయాలనే ఆలోచన రాలేదు. వారు తమ ఓ.ఎం.జీ సంస్థలో నాతో సినిమా చేస్తానన్నప్పుడు నాకు మొదటిసారి భయమేసింది. వేరే ప్రొడ్యూసర్స్ ప్రిపేర్ అయి ఇండస్ట్రీకి వస్తారు. వీళ్లు మాత్రం కేవలం నన్ను చూసి ప్రొడక్షన్ లోకి వస్తున్నారు. దాంతో నేనే మొత్తం ప్రిపరేషన్ చేశాను. ఇందాక మీనాక్షి చెప్పినట్లు "ఫణి" సినిమా చిన్న చిత్రంగా మొదలుపెట్టాం. ఆ తర్వాత కేథరీన్ గారు ఒప్పుకోవడంతో మరో స్థాయికి వెళ్లింది. అలా చివరకు గ్లోబల్ మూవీగా మారింది. కేథరీన్ మా సినిమాను ఒప్పుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేస్తోంది. వర్క్ షాప్స్ లోనూ పాల్గొంది. మహేశ్ శ్రీరామ్ కూడా అలాగే కోపరేట్ చేస్తున్నాడు. మా టీమ్ ప్యాషనేట్ గా "ఫణి" మూవీకి పనిచేస్తోంది. త్వరలోనే "ఫణి" చిత్రాన్ని గ్రాండ్ గా మీ ముందుకు థియేట్రికల్ రిలీజ్ ద్వారా తీసుకొస్తాం. అన్నారు.
 
నటీనటులు - కేథరీన్ ట్రెసా, మహేశ్ శ్రీరామ్, నేహా కృష్ణ, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, రంజిత, యోగిత, ప్రశాంతి హారతి, సాన్య, ఆకాష్, అనిల్ శంకరమంచి, కిరణ్ గుడిపల్లి, బాల కర్రి, దయాకర్, తదితరులు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు