కాగా, మన్ కీ బాత్ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రోత్సాహ వచనాలు మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు. అలాగే పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేసుకునేందుకు ఎంతో ఉదారంగా అనుమతి ఇచ్చిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ధన్యవాదాలు. ఈ మైలురాయి వంటి ఘటనను సాకారం చేయడంలో తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
ముఖ్యంగా, అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు కావడం మన గిరిజన రైతులకు గర్వకారణం. వారి అంకితభావం. కృషి అరకు కాఫీని జాతీయ స్థాయిలో ఉన్నతంగా నిలిపాయి. మనం ప్రతి కప్పును ఆస్వాదిస్తున్నపుడు మన గిరిజన రైతుల స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని కూడా గుర్తుచేసుకుందాం అని చంద్రబాబు పేర్కొన్నారు.