నోకియా 6.. కేవలం ఒకే ఒక్క నిమిషంలోనే అవుట్ ఆఫ్ స్టాక్.. చైనాలో రికార్డ్

శుక్రవారం, 20 జనవరి 2017 (14:51 IST)
నోకియా బ్రాండ్ పేరుతో హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఫోన్లను తయారు చేస్తోంది. శుక్రవారం నోకియా 6ను చైనా విపణిలోకి విడుదల చేశారు. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లో జేడీ.కామ్‌ వీటిని విక్రయానికి ఉంచగా, కేవలం ఒకే ఒక నిమిషంలో అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌ అని సందేశం కనిపించింది. దీంతో చైనాలో ఫస్ట్ ఫ్లాష్ సేల్‌గా నోకియా 6 రికార్డు సాధించింది.

ఆండ్రాయిడ్‌ నూగట్‌తో వస్తున్న ఈ ఫోన్‌ విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పది లక్షలమంది దీని కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారంటే నోకియాపై ఎంత క్రేజ్‌ ఉందో వేరే చెప్పనక్కర్లేదు. అత్యాధునిక ఫీచర్లతో విడుదలైన ఈ ఫోన్‌ ధర భారత కరెన్సీలో రూ.17,000 ఉంటుందని అంచనా. 
 
ఇకపోతే... నోకియా 6 ఏప్రిల్‌లో భారత్ మార్కెట్లోకి అడుగెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఫిబ్రవరిలో నోకియా బ్రాండ్‌పై మరిన్ని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చేందుకు హెచ్‌ఎండీ గ్లోబల్‌ సన్నాహాలు చేస్తోంది. ఇక నోకియా సిక్స్ ఫీచర్ల సంగతికి వస్తే.. 5.5అంగుళాల తాకే తెర, 1.1గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌‌ను ఈ ఫోన్ కలిగివుంటుంది. ఇంకా 16 మెగా పిక్సెల్‌ వెనుక కెమేరా, 8 మెగా పిక్సెల్‌ ముందు కెమెరాను కూడా కలిగివుంటుంది.

వెబ్దునియా పై చదవండి