వన్‌ప్లస్ ప్రత్యేక ఆఫర్‌... అదీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్‌కు మాత్రమే..

మంగళవారం, 17 నవంబరు 2020 (16:21 IST)
Teachers
ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మొబైల్స్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. ఇందుకు గాను వన్‌ప్లస్ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ పేరిట ఓ ప్రోగ్రామ్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ కింద విద్యార్థులు, ఉపాధ్యాయులు తగ్గింపు ధరలకు వన్‌ప్లస్ ఫోన్లు, యాక్ససరీలను కొనుగోలు చేయవచ్చు.
 
వన్‌ప్లస్ అందిస్తున్న ఆఫర్ కింద స్టూడెంట్లు, టీచర్లు వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్లపై వెయ్యి రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే యాక్ససరీలపై 5 శాతం డిస్కౌంట్ ఇస్తారు. అయితే ఈ ఆఫర్‌ను వాడుకోవాలంటే వారు స్టూడెంట్ బీన్స్ ద్వారా వెరిఫై చేసుకోవాలి. ఇక దేశంలోని 760 యూనివర్సిటీలు, 38,498 కాలేజీలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు వన్‌ప్లస్ తెలియజేసింది.
 
వన్‌ప్లస్ ఆఫర్ ద్వారా కేవలం ఒక్కసారి మాత్రమే డిస్కౌంట్‌ను పొందేందుకు వీలుంటుంది. అంటే ఎవరైనా సరే ఒకరు ఒకసారి మాత్రమే ఆఫర్‌ను వాడుకోవచ్చు. ఫోన్ లేదా యాక్ససరీలు దేనిపైనైనా ఒకసారి మాత్రమే డిస్కౌంట్‌ను పొందవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు