పసుపు టీ తాగడం వల్ల ప్రయోజనాలు (Video)

బుధవారం, 11 నవంబరు 2020 (11:22 IST)
పసుపులో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పసుపు లేనిదే వంటకాలు సిద్దం కాదనే విషయం తెలిసిందే. కొన్ని వేల ఏళ్ల నుండి భారతీయులు పసుపును ఓ ఔషధంగా వాడుతున్నారు. పసుపులో ఉండే కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీ ఇన్ప్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌తో పాటు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
 
పసుపు టీ తాగడం వల్ల ప్రయోజనాలు
వర్షాకాలం తర్వాత రోగులను వణికించే మరో సీజన్ శీతాకాలం. ఈ కాలంలో వైరెస్‌లు, బ్యాక్టీరియాలు మన శరీరంపై దాడి చేస్తాయి. కాబట్టి ఈ సీజన్లో పసుపు టీ తాగడం మంచిది. శీతాకాలంలో పసుపు టీ తాగడం వల్ల బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పసుపులో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు ఎక్కువ. పసుపులోని కుర్కమిన్ ట్యూమర్ల పెరుగుదలను అరికడుతుంది. క్యాన్సర్ కణాల విస్తరణను అరికడుతుంది. కాబట్టి పసుపు టీని రోజూ తాగడం మంచిది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు