శివలింగాన్ని సోమవారం పూజిస్తే..? రుద్ర పారాయణం చేస్తూ..?

సోమవారం, 9 నవంబరు 2020 (05:00 IST)
శివలింగాన్ని సోమవారం పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శివలింగ స్మరణ, దర్శనం, పూజతో పాపాలు తొలగిపోతాయి. శివలింగానికి చందనం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం, యజ్ఞాలు చేసే వారికి శివసాయుజ్యం చేకూరుతుంది. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. శివలింగాన్ని సోమవారం పూజిస్తే అగ్నిహోత్రం, గోదానం, సహస్ర అశ్వమేధయాగాలు చేసిన ఫలితాలు దక్కుతాయి. 
 
సోమవారం శివలింగ పూజ విశిష్ట ఫలితాలనిస్తాయి. శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో శివలింగాన్ని పూజిస్తే 12 కోట్ల శివలింగాలను పూజించిన ఫలితం లభిస్తుంది. తీర్థయాత్ర, యాగాలు చేయకుండా.. సోమవారం ఒక్క రోజున శివ లింగానికి పూజ చేస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయి. 
 
శివలింగ అభిషేక తీర్థం సేవిస్తే.. సర్వ పుణ్య తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం చేకూరుతుంది. సర్వ యాగాలు చేసిన ఫలితం ఖాతాలో పడుతుంది. రుద్ర పారాయణం చేస్తూనే శివలింగ పూజ చేస్తే శివసాయుజ్యం చేకూరుతుంది. శివలింగం వున్న చోట సమస్త లోకాలు, సమస్త దేవతలు వుంటారని విశ్వాసం.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు