ఆకట్టుకునే ఫీచర్లతో రిలీజైన రియల్‌మి 5 ప్రో స్మార్ట్‌ఫోన్

బుధవారం, 21 ఆగస్టు 2019 (11:25 IST)
మొబైల్స్ తయారీదారు సంస్థ రియల్‌మి భారత మార్కెట్‌లో రియల్‌మి 5 ప్రో పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.13,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.14,999గా ఉంది. 
 
ఈ ఫోన్‌లో టాప్ ఎండ్ మోడల్ వేరియంట్ 8 జీబీ, 128 జీజీ స్టోరేజ్ గల స్మార్ట్‌ఫోన్ ధర రూ.16,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 4వ తేదీ నుండి ఫ్లిప్‌కార్ట్, అలాగే రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్స్‌లో ప్రత్యేకంగా విక్రయించనున్నారు.
 
రియల్‌మి 5 ప్రో ప్రత్యేకతలు:
* 6.3 ఇంచ్‌ల డిస్‌ప్లే, 
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్, 
* 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 
* 48, 8, 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 
 
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, 
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 
* 4035 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు