ముఖ్యంగా, మీడియా టెక్ డైమెన్సిటీ 700 చిప్ సెట్ చేయగా, 50 మెగా పిక్సెల్‌తో ప్రధాన కెమెరాను అమర్చారు. ఈ మోడల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశముంది. అయితే, ప్రస్తుతానికి ఈ ఫోనుకు సంబంధించిన కొన్ని ఫీచర్లను షియోమీ వెల్లడించింది. అయితే, ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులు, ఆ సంస్థ వర్గాల సమచారం మేరకు కొన్ని ఫీచర్లు లీకయ్యాయి. వీటిని ఓ సారి పరిశీలిస్తే,
ఈ 5జీ స్మార్ట్ ఫోనులో రెండు సిమ్‌లు ఉంటాయి. ఈ రెండు కూడా 5జీకి సపోర్టు చేసే సదుపాయం ఉంది. మొబైల్ వినియోగదారుడు అవసరాన్ని బట్టి ఏ సిమ్‌ను అయినా 5జీ నుంచి 4జీ, జీఎస్ఎం వంటి వాటికి మార్చుకునే వెసులుబాటును కల్పించారు. ఈ ఫోనులో ప్రధానంగా 700 ఆక్టాకోర్ చిప్ సెట్‌ను అమర్చారు. 4జీబీ ర్యామ్ నుంచి 8 జీబీ ర్యామ్ వరకు మోడళ్లను అందుబాటులోకి తీసుకునిరానుంది.
సెప్టెంబర్ 6న షియోమీ సంస్థ అధికారికంగా రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ ఫోన్‌ను ఆవిష్కరించి, పూర్తి ఫీచర్లను ప్రకటించనుంది. ఆ తర్వాత వివిధ ఆన్‌లైన్, ఈ కామర్స్ వెబ్ సైట్లలో విక్రయాలు ప్రారంభంకానున్నాయి.