రెడ్ మీ 9ఏ స్మార్ట్ ఫోన్ విడుదల.. ఫీచర్లు ఏంటంటే?

బుధవారం, 2 సెప్టెంబరు 2020 (21:29 IST)
Redmi 9A
భారత్‌లో రెడ్ మీ 9ఏ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్ గ్లోబల్ లాంచ్ ఈ సంవత్సరం జూన్‌లోనే జరిగింది. రెడ్ మీ 9 సిరీస్‌లో రెడ్ మీ 9, రెడ్ మీ 9 ప్రైమ్‌ల తర్వాత లాంచ్ అయిన ఫోన్ ఇదేనని రెడ్ మీ తెలిపింది.

ఈ ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. మిడ్ నైట్ బ్లాక్, నేచర్ గ్రీన్, సీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 4వ తేదీన ఎంఐ.కాం, అమెజాన్, ఎంఐ హోం వెబ్ సైట్లలో ఈ ఫోన్ సేల్ కు వెళ్లనుంది. త్వరలో దీనికి సంబంధించిన ఆఫ్ లైన్ సేల్ కూడా ప్రారంభం కానుంది. 
 
రెడ్ మీ 9ఏ ధర రెడ్ మీ 9ఏ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో మనదేశంలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.6,799గా నిర్ణయించారు. ఇక 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గా ఉంది. 
 
రెడ్ మీ 9ఏ స్పెసిఫికేషన్లు 
6.53 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే
డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది.
మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్
3 జీబీ వరకు ర్యామ్, 
32 జీబీ స్టోరేజ్‌
బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్
10W ఫాస్ట్ చార్జింగ్ 
వాటర్ డ్రాప్ నాచ్ 
మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. 
ఇందులో వెనకవైపు 32 మెగా పిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు