పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.3,076 కోట్లు జమ అయినట్లు ప్రభుత్వం ఓ ఆడిట్ నివేదకలో తెలిపింది. ఈ ఏడాది మార్చి 31 వరకూ ఈ మొత్తం జమ అయినట్లు తెలిపింది. అయితే, మార్చి తర్వాత వచ్చిన డొనేషన్లు వెల్లడించలేదు.
పీఎం కేర్స్ ఫండ్ వెబ్‌సైట్‌లో ఈ వివరాలు ఉంచారు. తుది బాలెన్స్ 3,076 కోట్లు కాగా, ఈ మొత్తంలో రూ.3,075.85 కోట్లు దేశీయ కంట్రిబ్యూషన్‌గా, 39.67 లక్షలు విదేశీ కంట్రిబ్యూషన్‌గా పేర్కొంది. దాతల వివరాలను మాత్రం ఇంకా బహిర్గతం చేయలేదు.
దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఓ ట్వీట్‌లో స్పందించారు. ఉదారంగా విరాళిలిచ్చిన వారి పేర్లు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. ఎన్‌జీఓలు, ఇతర ట్రస్టులు తమకు విరాళిలిచ్చిన వారు పేర్లు తప్పని సరిగా వెల్లడించాల్సి ఉన్నప్పుడు, పీఎం కేర్స్ ఫండ్‌ను ఎందుకు ఈ నిబంధన నుంచి మినహాయించారని నిలదీశారు. డోనర్ల పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేశారు.