జియో బంపర్ ఆఫర్.. రూ.300 రీఛార్జ్ చేసుకుంటే.. రూ.76 పే బ్యాక్..

బుధవారం, 16 ఆగస్టు 2017 (10:23 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరుతో సంచలనం సృష్టించిన జియో, తాజాగా పోస్ట్ పెయిడ్, ప్రీ-పెయిడ్ రీఛార్జ్‌లపై మరో అద్భుత ఆఫర్‌ను ప్రకటించింది. పేటీఎం, ఫోన్ పే చెల్లింపు మాధ్యమాల ద్వారా రీచార్జ్ చేసుకుంటే 25శాతం వరకూ క్యాష్ బ్యాక్‌ను ప్రకటించింది. పేటీఎం ద్వారా రూ. 300 రీచార్జ్ చేసుకుంటే రూ.76, ఫోన్ పే ద్వారా అయితే, రూ. 75 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నట్టు తెలిపింది. 
 
రీఛార్జ్ జరిగిన 24 గంటల్లోపు క్యాష్ బ్యాక్ ఆఫర్‌లో భాగంగా రావలసిన డబ్బు మీ ఖాతాకు జమ అవుతుంది. ఈ ఆఫర్ కావాలంటే.. జియో యూజర్లకు కంపెనీ పంపిన ప్రోమో కోడ్‌ను ఎంటర్ చేయాల్సి వుంటుంది. ఆపై పేటీఎం యాప్‌లో మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ ఎంచుకుని ఫోన్ నెంబర్ ఫీడ్ చేసి 'ప్రోగ్రెస్ టు రీచార్జ్' లింక్‌ను క్లిక్ చేయాలి. ఆపై ప్రోమో కోడ్ ఎంటర్ చేసి రీచార్జ్‌తో పాటు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చునని జియో ఓ ప్రకటనలో తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు