రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ జియో 4జీ ఫీచర్ ఫోనును ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించారు. ముంబైలో జరిగిన ఆ సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చెల్లించి ఫోన్ తీసుకున్నప్పటికీ వినియోగదారులు పూర్తిగా నిరాశ చెందాల్సిందే. అదెలాగంటే...
జియో 4జీ ఫీచర్ ఫోన్.. కేవలం సింగిల్ సిమ్ మాత్రమే. డ్యుయల్ సిమ్ ఫోనుకాదు. పైగా, ఇది కేవలం జియో నెట్‌వర్క్‌కు మాత్రమే పని చేస్తుంది. ఇతర నెట్‌వర్క్స్ సిమ్‌కార్డులేవీ ఇందులో పని చేయవు. దీంతో ఈ ఫోను కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న వినియోగదారులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.