న్యూఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023లో, రిలయన్స్ జియో భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహ ఆధారిత గిగాఫైబర్ సేవను జియో స్పేస్‌ఫైబర్ ఆవిష్కృతమైంది. యోస్పేస్ ఫైబర్‌గా పిలుస్తున్న ఈ సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో రిలయన్స్ జియో విజయవంతంగా ప్రదర్శించింది.
ఈ సేవ అత్యంత సరసమైన ధరలలో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. జియో స్పేస్‌ఫైబర్ ఇప్పుడు భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలో అందుబాటులో ఉంది. జియో ఇప్పటికే భారత్‌లో 45 కోట్ల మంది కస్టమర్లకు ఫిక్స్‌డ్ లైన్, వైర్‌లెస్ మార్గాల ద్వారా వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది.