మొబైల్ మార్కెట్లో శాంసంగ్ అగ్రస్థానం.. షావోమీ వెనకబడిపోయిందా?

శనివారం, 8 ఆగస్టు 2020 (11:20 IST)
భారత మొబైల్ మార్కెట్లో శాంసంగ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో శాంసంగ్ షావోమిని వెనక్కి నెట్టింది. ప్రధానంగా గెలాక్సీ ఎం21 స్మార్ట్ ఫోన్ టాప్-5 మోడళ్లలో ఒకటిగా నిలిచింది. ఫీచర్ ఫోన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్ 24 శాతం వాటాతో షావోమీ, వివో కంటే వెనుక ఉంది. ఆన్‌లైన్ వ్యాపారంలో రెండో స్థానంలో ఉంది.
 
స్మార్ట్ ఫోన్‌లకు సంబంధించి షావోమీ కంటే వెనుకబడి ఉన్నప్పటికీ జూన్ త్రైమాసికంలో 26.3 శాతం మార్కెట్‌ను సాధించడం ద్వారా అంతరాన్ని భారీగా తగ్గించింది. అంతకుముందు క్వార్టర్‌లో 15.6 శాతం మాత్రమే. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో షియోమీ 29.5 శాతం, శాంసంగ్ 26.3 శాతం, వివో 17.5 శాతం వాటాను కలిగి ఉంది.
 
ఇందుకు చైనా తీరే కారణంగా చెప్తున్నారు వాణిజ్య విశ్లేషకులు. కరోనా మహమ్మారి ఆ తర్వాత గాల్వాన్ వ్యాలీలో చైనా దుందుడుకు చర్యలతో మెజార్టీ భారతీయులు చైనా వస్తువులను ఉపయోగించవద్దని నిర్ణయించారు. ఈ ప్రభావం ఇండియన్ హ్యాండ్‌సెట్ మార్కెట్లో స్పష్టంగా కనిపించింది.
 
అంతకు ముందు చైనా కంపెనీలదే హవా. కొరియన్ ఫోన్‌మేకర్ శాంసంగ్ మూడో స్థానంలో నిలిచేది. అయితే ఇప్పుడు హ్యాండ్‌సెట్ మార్కెట్లో చైనాకు చెందిన షావోమీ దాటి మొదటి స్థానంలోకి దూసుకు వచ్చిందని ఇంటర్నేషనల్ డేటా కార్పోరేషన్ (ఐడీసీ) తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు