గత ఏడాది డిసెంబర్‌లో పలువురి బ్యాంకు వివరాలు చోరీ కావడం, వారి ఫోన్లలోని డేటా మొత్తం పోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యాంకింగ్ మాల్వేర్ లోనే మూడు రకాలున్నాయంటున్నారు. బ్రాటా.ఏ, బ్రాటా.బీ, బ్రాటా.సీగా వాటిని పిలుస్తున్నారు.
ప్రస్తుతం బ్రిటన్, పోలండ్, ఇటలీ, స్పెయిన్, చైనా, లాటిన్ అమెరికా దేశాల్లోని నెట్ బ్యాంకింగ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు బ్రాటాతో దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది.