దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్‌పై ఆధార్ కార్డు జారీ సంస్థ యుఐడీఏఐ (యునిక్యూ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) కొరఢా ఝుళిపించింది. ఇందులోభాగంగా, పలు ఎయిర్‌టెల్ సేవలను రద్దు చేసింది. వీటిలో ప్రధానమైనది ఎయిర్ పేమెంట్స్ బ్యాంక్ ఒకటి. అలాగే, మొబైల్ నంబరుకు, ఆధార్ కార్డు అనుసంధాన ప్రక్రియ. దీంతో దిగివచ్చిన ఎయిర్‌టెల్ కాళ్లావేళ్లా పడుతోంది.
అంతేకాకుండా, ఆధార్ - సిమ్ అనుసంధాన ధ్రువీకరణ లైసెన్సును కూడా తాత్కాలికంగానూ, పేమెంట్స్‌బ్యాంక్ ఖాతాదారులకు ఎలక్ట్రానిక్ (ఇ) కేవైసీ నిర్వహించడాన్నీ రద్దు చేసింది.
భారతీ ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ పేమెంట్స్‌బ్యాంక్‌లలో ఆడిట్ నిర్వహించాలని ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్‌ను ఆధార్ జారీ సంస్థ యూఐడీఏఐ కోరింది. ఆధార్ చట్టానికి అనుగుణంగా ఆయా సంస్థలు వ్యవహరిస్తోందీ, లేనిదీ పరిశీలించాలని ఆదేశించింది.