జియోలో విస్టా పెట్టుబడి.. రూ.4.09 లక్షల కోట్లకు పెరిగిన విలువ

శుక్రవారం, 8 మే 2020 (18:38 IST)
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ జియోలో భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టింది. రూ.43,574 కోట్ల మేర జియోలో ఫేస్‌బుక్ పెట్టుబడి పెట్టింది. దీని ద్వారా 9.99 శాతం జియో ప్లాట్ ఫామ్స్‌లోని వాటాను ఎఫ్‌‍బీ దక్కించుకుంది. తాజాగా అమెరికా బేస్డ్‌గా కార్యకలాపాలు నడిపించే విస్టా ఈక్విటీ పార్ట్ నర్స్ (విస్టా) అనే సంస్థ రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమైంది. 
 
విస్టా రూ.11,376 కోట్లతో జియోలో 2.32శాతం స్టాక్ కొనుగోలుకు రెడీ అయింది. అతి తక్కువ కాలంలో జియోలో ఇది మూడో అతి పెద్ద ప్రొఫైల్ ఇన్వెస్ట్ మెంట్ కానుంది. గత మూడు వారాల్లో ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు జియోలో రూ.60,596 కోట్లను ఇన్వెస్ట్ చేశాయని రిలయన్స్ ఇండస్ట్రీ తెలిపింది. ఈ నెల 4వ తేదీన సిల్వర్ లేక్ అనే మరో యూఎస్ బేస్ట్ సంస్థ జియోలో రూ.5,656 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. దీంతో జియో విలువ రూ.4.09 లక్షల కోట్లకు చేరింది.
 
దేశ ప్రజల ప్రయోజనం కోసం.. మంచి భవిష్యత్ కోసం ట్రాన్స్ ఫర్మేటివ్ పవర్ ఆఫ్ టెక్నాలజీ అవసరమని విస్టా నమ్ముతోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ముఖేశ్ అంబానీ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు