ఇకపై 3సేవలను 4జీగా మార్చేస్తున్నాం.. వొడాఫోన్, ఐడియా

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (16:00 IST)
భారత్‌లో వొడాఫోన్, ఐడియా సంస్థలు తమ వినియోగదారులకు అందించే 3సేవలను 4జీగా మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. భారత్‌లో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోతో పోటీపడేందుకు టెలికాం రంగ సంస్థలన్నీ తట్టుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలో వొడాఫోన్, ఐడియా సంస్థలు గత 2018లో చేతులు కలిపాయి. అయినప్పటికీ గత నెలలో ఈ సంస్థలు ''విఐ''గా మారాయి. 
 
తాజాగా కస్టమర్లకు అతివేగంగా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు గాను... 3జీ సేవలను 4జీ సేవలుగా అందించేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించాయి. పలు విడతలుగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తాయి. అందుచేత 900ఎంహెచ్‌జెడ్, 1800ఎంహెచ్‌జెడ్, 2100 ఎంహెచ్‌జెడ్ వేవ్స్‌కు మార్చేందుకు సిద్ధంగా వుంది. అదే సమయంలో 2జీ సేవలను వాయిస్ కాల్స్ సేవల ద్వారా అందించనుంది. ఈ సేవలు దేశంలో 100 కోట్ల భారతీయులకు అందించడం జరుగుతుందని సంస్థ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు