27 లక్షల అకౌంట్లను ఆపేసిన వాట్సాప్

శుక్రవారం, 4 నవంబరు 2022 (14:30 IST)
భారత ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా లక్షలాదిగా వాట్సాప్ అకౌంట్లను ఆపేసింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించింది. వీటిలో 8 లక్షలకుపైగా అకౌంట్లను ఎలాంటి ఫిర్యాదులు రాకముందే తొలగించినట్లు పేర్కొంది.  
 
అంతేకాకుండా సెప్టెంబర్‌లో 666 ఫిర్యాదులు అందగా, 23 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. ఫేక్‌ వార్తలు, తప్పుడు సమాచారాన్ని నిరోధించే క్రమంలో నకిలీ, తప్పుడు ఖాతాలను బ్యాన్ చేసినట్లు మెటా తెలిపింది. దీంతో ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చినట్లైంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు