థర్డ్ పార్టీలు డెవలప్ చేసిన అనుబంధ వాట్సాప్ యాప్‌లను ఉపయోగించే వినియోగదారులకు వాట్సాప్ సంస్థ అడ్డుకట్ట వేసింది. వినియోగదారుల నుండి వచ్చే ఫిర్యాదులు, నివేదికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో, అధికారిక వాట్సాప్ నియమ నిబంధనలను, సేవలను పాటించడంలో విఫలమైనందున, అదేవిధంగా భద్రతా కారణాల దృష్ట్యా ఇలా చేయక తప్పడం లేదని చెప్పింది. వాట్సాప్ ప్లస్, జీబీ వాట్సప్‌ల యూజర్లను బ్యాన్ చేస్తునట్లు ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ తెలిపింది.