వాట్సప్‌లో స్టేటస్ నచ్చకపోతే ఈ ఫీచర్‌‌ను వాడుకోవచ్చు..

గురువారం, 27 జూన్ 2019 (15:23 IST)
ప్రస్తుతం వాట్సప్ అప్లికేషన్‌ని వినియోగించే వారి సంఖ్య కోట్లలో ఉందనే చెప్పాలి. అందులో ఉండే స్టేటస్ ఫీచర్ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. వాట్సప్ అందించిన బెస్ట్ ఫీచర్లలో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. చాలా మంది వినియోగదారులు వాట్సప్ స్టేటస్ ఫీచర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.


స్టేటస్ ఫీచర్‌ను ఉపయోగించడంలో సమస్యను ఎదుర్కొనే వాళ్లు కూడా ఉన్నారు. స్టేటస్‌లో డాట్ సింబల్ కనిపిస్తుంటే మొత్తం స్టేటస్‌లను చూడకుండా ఉండలేరు. అందులో కొంత మంది స్టేటస్‌లు బాగుంటాయి, మరికొందరి స్టేటస్‌లు అస్సలు నచ్చవు. 
 
నచ్చకపోయినప్పటికీ వాటిని చూడాల్సి వస్తుంది. స్టేటస్ నచ్చకపోతే మ్యూట్ ఆప్షన్‌ని సెలక్ట్ చేసినా కూడా లిస్ట్‌లో మాత్రం వారి స్టేటస్‌లు ఇంకా కనిపిస్తుంటాయి. అలాంటి వారి స్టేటస్‌లను ఇకపై చూడనక్కర్లేదు. స్టేటస్ నచ్చనివారి స్టేటస్‌లను లిస్ట్‌లో కనిపించకుండా చేయవచ్చు. ఇష్టంలేని వారి స్టేటస్‌ను శాశ్వతంగా హైడ్ చేసే ఫీచర్‌ను వాట్సప్ త్వరలో అందించబోతోంది.
 
ఆన్‌లైన్ పోర్టల్ WABetaInfo అందించిన సమాచారం ప్రకారం 2.19.183 ఆండ్రాయిడ్ బీటా వర్షన్‌లో ఇప్పటికే హైడ్ స్టేటస్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ను టెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వినియోగదారులకు వాట్సప్ అందించనుంది.

ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందంటే మీకు ఎవరి స్టేటస్‌లు నచ్చట్లేదో వారి స్టేటస్ హైడ్ చేయొచ్చు. అలాగే తర్వాత మళ్లీ కావాలనుకుంటే 'షో' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల వారి స్టేటస్‌లు మళ్లీ కనిపిస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు