విండోస్ 11లో స్టార్ట్ మెనూ కొత్తగా ఉంటుందని అన్నారు. టాస్క్ బార్, ఫాంట్, ఐకాన్‌ల విషయంలోనూ సరికొత్త అనుభూతిని అందిస్తుందన్నారు. విండోస్ 11 ఓఎస్ ద్వారా ఆండ్రాయిడ్ యాప్‌లను కూడా వినియోగించుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుందన్నారు.
ఈ ఏడాది చివరినాటికి కొత్త కంప్యూటర్లతోపాటు విండోస్ 10 వినియోగదారులకు కూడా ఈ సరికొత్త ఓఎస్ ఉచితంగా అందుబాటులోకి వస్తుందని సత్య నాదెళ్ల తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్లు, ఇతర స్మార్ట్ పరికరాలు ప్రజాదరణ పొందడంతో విండోస్.. ఆపిల్, గూగుల్ నుంచి గట్టి పోటీని మైక్రోసాఫ్ట్ ఎదుర్కొంటోందని తెలిపారు.