గిజ్‌మోడో అనే సంస్థ చేసిన పరిశోధన ద్వారా యాడ్స్ పంపించడానికి యూజర్ల ఫోన్ నంబర్లను వాడుతున్నామని ఫేస్‌బుక్ కూడా అంగీకరించింది. సెక్యూరిటీ కారణాల కోసం యూజర్లు ఇచ్చిన మొబైల్ నెంబర్లను, యూజర్లు ఇవ్వకపోయినా ఇతరుల కాంటాక్ట్ బుక్‌ల నుంచి సేకరించి వాటిని యాడ్స్ కోసం ఎఫ్‌బీ వాడుకుంటుందని గిజ్‌మోడో తెలిపింది. ఈ రిపోర్ట్‌పై స్పందించిన ఫేస్‌బుక్.. అది నిజమేనని చెప్పింది. ఈ అడ్వర్‌టైజింగ్ ద్వారా కూడా ఫేస్‌బుక్‌కు భారీగానే ఆదాయం వస్తుందనేది నిజం.