రియాన్ అనే చిన్నారి తాను ఆడుకునే బొమ్మల వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ఏడాదిలోనే కోట్లాది రూపాయలను ఆదాయంగా పొందాడు. అమెరికాకు చెందిన రియాన్ అనే ఈ చిన్నారి.. ఒక బొమ్మను కొనేముందు.. దాని విలువ ఏంటో తెలుసుకున్నాకే దాన్ని కొంటాడు. దీంతో పాటు రియాన్ తన తల్లిదండ్రుల సాయంతో గత మార్చి 2015వ సంవత్సరంలో రియాన్ టాయ్స్ రివ్యూ అనే యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు.