సీనియర్ సిటిజన్‌ల కోసం వెబ్‌సైట్

శనివారం, 12 ఏప్రియల్ 2008 (10:45 IST)
సీనియర్ సిటిజన్‌ల కోసం ముంబాయిలో ఓ సరికొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. వృద్ధులకు సంబంధించిన అనేక రకాల వివరాలతో కూడిన సమాచార సేవ మరియు అవగాహన తదితరమైనవి 'సిల్వర్ ఇన్నింగ్స్' అనే ఈ వెబ్‌సైట్‌లో పొందిపరిచినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.

ఈ వెబ్‌సైట్‌ను సమాచార హక్కు కార్యకర్త శైలేష్ గాంధీ, హెల్ప్ ఏజ్ ఇండియా రీజినల్ డైరెక్టర్ (పశ్చిమ) జాన్ థాటిల్, వెబ్‌సైట్ సృష్టికర్త మరియు సిల్వర్ ఇన్నింగ్స్ సంస్థలో సభ్యుడు శైలేష్ మిశ్రాలు సంయుక్తంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. వృద్ధాశ్రమాల్లో వృద్ధుల జీవితాల సమగ్ర సమాచారం ఈ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నామని మిశ్రా విలేకరులకు వెల్లడించారు.

అలాగే ఈ వెబ్‌సైట్‌లో ఆరోగ్యం, శారీరక సామర్థ్యం వంటి సేవల విభాగానికి సంబంధించిన వివరాలు... పెట్టుబడి, ఫైనాన్స్, ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా అందించనున్నట్లు మిశ్రా వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆహార, పోషకాహార నిపుణులు, వైద్యుల సలహాల సమాచారం కూడా ఈ వెబ్‌సైట్‌లో పొందుపరచబడి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి