ప్రపంచ వ్యాప్తంగా 150 భాషల్లో, భారత్‌లో తెలుగు, తమిళం, హిందీలతో పాటు 11 భాషల్లో టిక్ టాక్ యాప్ అందుబాటులో వుంది. ముంబై, ఢిల్లీలో టిక్ టాక్ సంస్థకు చెందిన కార్యాలయాలున్నాయి. ఇందులో 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత ఏడాదిలో మాత్రం 60లక్షల వీడియోలను హింస, అశ్లీలత కారణంగా డిలిట్ చేసినట్లు టిక్ టాక్ వెల్లడించింది.
అయితే ఈ టిక్ టాక్ ద్వారా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, వీడియోలను పోస్టు చేసే అలవాటు ద్వారా టిక్ టాక్‌కు అడిక్ట్ అవుతున్నారని తేలింది. అందుకే టిక్ టాక్ సంస్థ 13 విధివిధానాలను అమలు చేసింది. ఈ విధుల్లో 13 ఏళ్లలోపు గల వారు టిక్ టాక్ యాప్‌ను ఉపయోగించలేరు. అయితే ఇప్పటికే టిక్ టాక్‌ను నిషేధించాలని తమిళనాడులో డిమాండ్ పెరిగిపోతూ వస్తోంది.