యాంకర్ రవి ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ వుంటాడు. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ఆపై సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్తుండటం చేసి వున్నాడు. ప్రస్తుతం ఓ టీవీ షోలో ఏపీ ప్రజలను కించపరిచే విధంగా ఓ కంటెస్టెంట్ వ్యాఖ్యలు చేయడం... దానికి యాంకర్ రవి సపోర్ట్ చేసినట్టుగా కామెంట్స్ చేయడంతో వివాదం మొదలైంది.
ఇంకా యాంకర్‌గా తన స్థానంలో ఎవరున్నా అలాగే చేసేవారని వివరణ ఇచ్చాడు. తనకు ఏపీ ప్రజలు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటే ఎంతో అభిమానమని చెప్పుకొచ్చాడు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని నెటిజన్లను కోరాడు.